yesayya nee prema naa sonthamu lyrics

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం     ||యేసయ్య||

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ     ||యేసయ్య||

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు
మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు     ||యేసయ్య||




 

Meaning of this song

Jesus Your love is my own - the hymn uttered in me
Jesus

You are the first ray - the ray of light that shines in me
My lamp that never goes out - the basis of my life
Your friendship as Emanuel - eternity in me is a celebration || Yesayya ||

You always loved me - you hid me in your love
You carried all my burdens - you increased me a lot
You have burned me in your grace - you have shown me mercy
Meditation of your word in my heart - remembrance of your name in my mind
Worship you - live in your grace
Worship you yesterday - cut yourself